![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -18 లో.. సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వాంటెడ్ డ్రైవర్ అని అడ్వటైజ్ వేయడంతో రామలక్ష్మి ఆఫీస్ కి వస్తుంది. రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరిని కలిపే ప్రయత్నంలో భాగంగా సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఆలా చేస్తాడు. దాంతో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య దగ్గరకి రామలక్ష్మి వస్తుంది. ఏం మాట్లాడకుండానే సీతాకాంత్ వాళ్ళ తాతయ్య.. నువ్వు ముందు జాయిన్ అవ్వు.. లెటర్ పై సంతకం చెయ్ అని అనడంతో రామలక్ష్మికి ఏం అర్థం కాదు.
ఆ తర్వాత నువ్వ పని చేయాల్సింది నా దగ్గర కాదు మా బాస్ దగ్గర అని తనని సీతాకాంత్ దగ్గరకీ తీసుకొని వెళ్తాడు. రామలక్ష్మి బయట ఉంటుంది. పెద్దాయన వెళ్లి నువ్వు ఒక అమ్మాయి కష్టాల్లో ఉంది సాయం చేద్దామని అన్నావ్ కదా.. నీకు డ్రైవర్ గా ఆ అమ్మాయికి జాబ్ ఇచ్చానని చెప్తాడు. తనకు వేరే సాయం చెయ్.. నాకు తనకి అసలు పడదు వద్దని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సీతకాంత్ ని రామలక్ష్మి చూసి.. ఈ ఓసీడీ దగ్గర నేను పని చేసేదని వెళ్లిపోతుంటే.. అప్పుడే పెద్దాయన వాళ్ళ పీఏలు ఆపి జాబ్ లో జాయిన్ అయి అగ్రిమెంట్ పై సంతకం చేసావని అనగానే.. ఆ పేపర్ ని చింపేస్తుంది రామలక్ష్మి. ఇక వీళ్ళని ఆ దేవుడే కాపాడాలని పెద్దయన అంటాడు.
మరొకవైపు లవ్ బర్డ్స్ అయిన సిరి, ధన ఇద్దరు ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే.. సిరి వాళ్ళ అమ్మ శ్రీలతతో పాటు సందీప్ చూస్తారు. ఆ తర్వాత ధన ఇంటికి వెళ్తుంటే శ్రీలత మనుషులు ధనని తీసుకొని శ్రీలత దగ్గరకీ తీసుకొని వస్తారు. నా కూతురు జోలికి వస్తే బాగుండదని శ్రీలత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నా చెల్లికి నువ్వు సైలెంట్ గా దూరం కావాలని ధనకి సందీప్ వార్నింగ్ ఇస్తాడు.
ఆ తర్వాత రామలక్ష్మి వాళ్ళ అమ్మ ఒక దగ్గర పని చేస్తుంటే రామలక్ష్మి చూసి ఇంటికి తీసుకొని వెళ్తుంది. నేను ఉండగా నువ్వు ఎందుకు పని చేస్తావని చెప్తుంది. మాణిక్యం మాత్రం ఇంటి గురించి ఏం పట్టించుకోడు. ఆ తర్వాత శ్రీలత ఇంటికి వస్తుంది. ఈ విషయం సీతాకాంత్ కి చెప్పొద్దని శ్రీవల్లికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |